Thursday, March 28, 2024

ముహూర్తం ఫిక్స్….సెప్టెంబర్ లో పెళ్లి సందD

రాఘవేంద్ర రావు, శ్రీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పెళ్లిసందD తెరకెక్కుతోంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుండగా… శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా దర్శకురాలు గౌరీ రోణంకి మాట్లాడుతూ అన్ని జోనర్లో బ్లాక్ బాక్స్ సినిమాలు తీసి ఎందరో హీరోల ని స్టార్ట్స్ చేశారు మా గురువుగారుమ్ ఆయన గైడెన్స్ తో పెళ్లి సందD షూటింగ్ పూర్తయింది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, కామెడీ అన్ని కూడా బాగున్నాయి. అలాగే కీరవాణి గారు మరోసారి తన సంగీతంతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాటలను, టీజర్, ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తామని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు గౌరీ రోణంకి.

Advertisement

తాజా వార్తలు

Advertisement