Friday, March 29, 2024

బంగార్రాజు తో పాయల్ !!

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి ఫలితాలను కూడా సాధించింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగ్. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అక్కినేని నాగార్జున సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడానటించబోతుంది.అలాగే తాజా సమాచారం ప్రకారం…ఓ స్పెషల్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది పాయల్. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయింది. దీంతో ఐటెం సాంగ్ కూడా చేయడానికి రెడీ అవుతోంది పాయల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement