Thursday, April 25, 2024

మరోసారి నెగిటివ్ షేడ్ పాత్రలో పాయల్

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ అందాలను ఆరబోస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే ఈ సినిమాలు పాయల్ కు స్టార్ డమ్ ను తీసుకురాలేకపోయాయి. తర్వాత ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే… మరోవైపు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది. ఇటీవల ఓటిటిలో రిలీజైన అనగనగా ఓ అతిధి సినిమాలో కూడా నటించింది.

ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కు ఓకే చెప్పింది పాయల్. త్రీ రోజెస్ పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో పాయల్ అవకాశం దక్కించుకుందట. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పాయల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న ఏంజల్ అనే హర్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ లో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement