Thursday, May 26, 2022

జులై నుండి పవన్‌ కొత్త సినిమా..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వీరమల్లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. క్రిష్‌ దర్శకుడు. ఎ.ఎం.రత్నం నిర్మాత. భీవ్లూనాయక్‌ తర్వాత పవన్‌ కొత్త సినిమాలను అంగీకరిస్తూనే ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు ఇలా తన డేట్స్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ క్యారెక్టర్‌ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దర్శకత్వం నుండి నటుడిగా మారిన సముద్రఖని తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలవైకుంఠపురములో నుండి తెలుగులో ఎక్కువ సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా రిలీజైన ‘సర్కారువారి పాట’లో ఆయన ధరించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో తమిళ సినిమా ‘వినోదయ సీతమ్‌’ రీమేక్‌ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వంలో రూపొందనుంది. ఇందులో సాయిధరమ్‌ మరో ముఖ్యపాత్రధారి. పవన్‌ కల్యాణ్‌ దేవుడి పాత్రలో నటిస్తారని సమాచారం. జులైలో షూటింగ్‌ ప్రారంభమవుతుందని సముద్రఖని ఒక ఇంటర్యూలో చెప్పారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ సైతం సహకారం అందిస్తారని తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement