Thursday, April 18, 2024

హ‌రీష్ శంక‌ర్ బ‌ర్త్ డే.. శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ బ‌ర్త్ డే నేడు..నేటితో ఆయ‌న 44వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి హరీష్ శంకర్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ ప్రేక్షకుల నాడీ, నవతరం అభిరుచులు తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు భాష, రచనలు, కళల గురించి హరీష్ శంకర్ కి చక్కటి అవగాహన ఉంది. ఆయన భవిష్యత్తులో మరిన్ని విషయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని పవన్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హరీష్ శంక‌ర్ .. పవర్ స్టార్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement