Friday, April 19, 2024

సీఎం జరగాలబ్బా… కోరుకుంటే వచ్చేది కాదు – పవన్ పంచ్ డైలాగ్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు మామూలుగా సందడి చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సీఎం సీఎం అంటూ గోల చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ సీఎం జరగాలబ్బా… కోరుకుంటూ వచ్చేది కాదు అంటూ సమాధానమిచ్చాడు. సమాజం కోసం దేశం కోసం పని చేసుకుంటూ పోతామని, ఉన్నతమైన స్థానం ఇస్తే సంతోషం అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

అభిమానుల గుండెల్లో స్థానం ఉంది. ఆ ప్రాసెస్ లోనే ఏదైనా వస్తే చూద్దాం తప్ప దేని కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కాగా వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement