Thursday, March 28, 2024

పూరీ తో పవన్ ? త్వరలోనే ప్రకటన !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలును ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే హరిహర వీరమల్లు ,అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే ఈ సినిమాతో పాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా వచ్చేసాయి.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఆ అప్డేట్ మరేదో కాదు… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా చేయబోతున్నాడట. అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో బద్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ కొత్త సినిమా వార్తలపై ఫ్యాన్స్ లో మంచి జోష్ నెలకొంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఆల్రెడీ ఈ సినిమా కోసం లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మరి ఎంత వరకు నిజం ఉందో తెలియరావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement