Thursday, March 28, 2024

మొగులయ్యకు 2 లక్షల చెక్ అందించిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. గిరిజన ప్రాంతాలకే పరిమితమైన కిన్నెర వాయిద్యంతో అద్భుతమైన గానం చేస్తూ రంజింప చేస్తున్న జానపద కళాకారుడు మొగులయ్యకు జనసేనాని పవన్ కల్యాణ్ ఆత్మీయ సత్కారం చేశారు. ఆయనకు శాలువా కప్పిన పవన్ రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. ఈ మేరకు స్వయంగా మొగులయ్యకు చెక్ అందజేశారు. భీమ్లా నాయక్ లోని టైటిల్ సాంగ్ లో సాకి ఆలిపిస్తూ కిన్నెర మెట్లపై  స్వరాన్ని పలికించాడు  కళాకారుడు మొగులయ్య. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య   12 మెట్ల కిన్నెరపై పాఠలు పాడే అరుదైన కళాకారుడు.  భీమ్లా నాయక్ సినిమాలోని  టైటిల్ సాంగ్ లో  మొగులయ్య పాటపాడుతూ కనిపిస్తాడు.

YouTube video

ఇది కూడా చదవండి: వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే ఆయనే గుర్తోచ్చారు: ఏపీ స్పీకర్ తమ్మినేని

Advertisement

తాజా వార్తలు

Advertisement