Thursday, April 25, 2024

అల్లుఅర్జున్ పై విజయం సాధించిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ అల్లుఅర్జున్ పై విజయం సాధించడం ఏంటి అని అనుకుంటున్నారా… ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ గా ప్రసారం అయింది. ఈ సినిమాకు ఏకంగా 32.20 టిఆర్పి రేటింగ్ వచ్చింది.

అయితే గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురములో చిత్రం 29.4 టిఆర్పి రేటింగ్ ను సాధించి రికార్డ్ సృష్టించింది. కాగా ఇప్పుడు వకీల్ సాబ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనన్య, నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement