Saturday, April 10, 2021

టాలెంటెడ్ పీపుల్ బీ రెడీ.. నిర్మాతగా పవన్ వరుస సినిమాలు

నవతరం ఆలోచనలు కలిగిన ప్రతిభ ఉన్న వాళ్లను హీరో పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకురానున్నాడు. టాలెంటెడ్ పీపుల్‌కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ ద్వారా పవన్ ఓ అవకాశం ఇవ్వనున్నాడు. కొత్త కథలతో దాదాపు 15 సినిమాలను నిర్మించనున్నట్టు పవన్ బ్యానర్ ప్రకటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు, 6 మధ్యతరహా చిత్రాలు, 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి. కథా రచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఈ భాగస్వామ్యం ఉండనుంది. హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కాగా హీరోగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News