Saturday, April 20, 2024

పవన్ హరీష్ లు ముహూర్తం ఫిక్స్ చేసేసారట !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల మూడవ వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందట. అందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ ని కూడా ఏర్పాటు చేశారట.

పవర్ స్టార్ ఈ సినిమాలో ఒక సారి కొత్త హెయిర్ స్టైల్ తో డిఫ్రెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత వరకు ఉంది అనేది తెలియాల్సి ఉంది. గతంలో హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఆ సినిమా ఇండస్ట్రీలో రికార్డు స్థాయిలో హిట్ సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement