Monday, March 25, 2024

పవన్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ….ఇక పట్టాలెక్కటమే తరువాయి !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను హరీష్ శంకర్ పూర్తి చేశాడట. పవన్ కళ్యాణ్ కు కూడా ఆ స్క్రిప్ట్ ను వినిపించాడట. అది విన్న పవన్ కళ్యాణ్ వెంటనే షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. జూలై నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని… నెలకు పది రోజుల చొప్పున ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పవన్ పోలీస్ గా కనిపించనున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement