Saturday, April 20, 2024

నాగ బాబును ఆకట్టుకున్న పవన్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్ పై చేతిలో సూట్కేసు పట్టుకుని పవన్ స్టైలిష్ గా కూర్చున్నాడు.

అయితే ఈ పోస్టర్ పై మైత్రి మూవీ మేకర్స్ లోగో కూడా ఉండడంతో ఇది నిజమైన పోస్టర్ అని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అయింది. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందిస్తూ ఇది ఫేక్ అని చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా ఈ పోస్టర్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. యంగ్ టాలెంట్ కి ఇంటర్నెట్ మరొక ఇల్లు లాంటిది అని చెప్పుకొచ్చాడు. వారి ప్రతిభను ఉద్దేశిస్తూ వావ్ అంటూ నాగబాబు పోస్టర్ ను షేర్ చేశాడు.

https://www.instagram.com/p/CP5ASWtMI5s/?utm_source=ig_web_copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement