Thursday, October 10, 2024

Parineeti Chopra | మాల్దీవ్స్‌లో ‘పారి’జాతం..

పారి అలియాస్ పరిణీతి చోప్రా రాజ‌కీయ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దాను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత ఈ జంట గోల్స్ ఇత‌రుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. నిరంత‌రం ఒక‌రితో ఒక‌రుగా ప్రేమైక ఆనందంలో ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా మాల్దీవుల నుంచి స్పెష‌ల్ ఫోటో ఆల్బమ్ విడుద‌లైంది. పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మాల్దీవులకు వెళ్లారు. పరిణీతి తమ వెకేష‌న్ నుండి రాఘవ్ పాస్‌పోర్ట్ ఫ్లెక్స్, సుందరమైన ప్రదేశాలను షేర్ చేసింది. అందమైన రిసార్ట్, అందమైన అబ్బాయి.. నేను… అద్భుతమైన 48 గంటల వేకేష‌న్ కోసం జోయాలీకి ధన్యవాదాలు! అని రాసింది పరిణీతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement