Friday, April 26, 2024

అక్కినేని హీరోతో వైష్ణవ్ తేజ్ సినిమా

వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్ల రూపాయలను వసూళ్లు సాధించింది. మరోవైపు వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలాఉండగా కింగ్ అక్కినేని నాగార్జున తో మరో సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో నాగార్జున నటించడం లేదట. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నాడట. ఇక ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగ్ ఈ పనులు పూర్తయ్యాక ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారట. ఇక ఈ సినిమాతో కొత్త దర్శకుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా త్వరలోనే ప్రకటన చేస్తానని నాగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement