Thursday, April 25, 2024

‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ రిలీజ్ డేట్ – టైటిల్ సాంగ్ రిలీజ్

క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప‌లు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రం కూడా రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మే 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కరోనా మహమ్మారి కరుణిస్తే కచ్చితంగా అదే తేదీన తాము చిత్రాన్ని విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.హీరో గోపిచంద్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై, బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైనా.. ఫ‌స్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ల కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement