Friday, March 29, 2024

OTT : ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఐ ల‌వ్ యూ.. ట్రైల‌ర్ రిలీజ్

డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న‌టించిన చిత్రం ఐ ల‌వ్ యూ. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవిల్ గులాటి హీరోగా నటించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కాస్త ఆసక్తిని రేకెత్తించింది. కాగా ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది. ట్రైలర్ లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు. లవ్ ట్రాక్ తో స్టార్ట్ అయిన ట్రైలర్.. ఒక్కసారిగా థిల్లర్ మోడ్ లోకి వెళ్లింది. రకుల్ ను ఎవరో ఓ బిల్డింగ్ లో బంధించడం. రకుల్ మూతికి బాండ్ కట్టడం, దానిపై ఐ లవ్ యూ అని ఎరుపు రంగులో ఉండటం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రకుల్ ను ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా జూన్ 16 నుంచి జియో సినిమాస్ ఓటీటీలో విడుదల కానుంది. కాగా ఫ్రీ గా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement