Wednesday, April 24, 2024

సిద్దార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ వచ్చేసింది

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత సిద్దార్థ్ కు తెలుగులో అనుకున్న స్థాయిలో హిట్స్ రాలేదు. అయితే ఇప్పుడు శశి దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా ఒరేయ్ బామ్మర్ది సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి లిజోమోల్ జోస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ ఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా ఆ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలుగులో రిలీజ్ చేస్తున్న ఏ ఎన్ బాలాజీ మాట్లాడుతూ… సిద్ధార్థ్ జీవి ప్రకాష్ కుమార్ కలిసి నటించినఈ యాక్షన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఇద్దరూ పోటా పోటీగా సినిమాలో నటించారు. ఫస్ట్ లుక్ అందరికీ నచ్చింది. టీజర్ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు బాలాజీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement