Friday, April 19, 2024

ఆప‌రేష‌న్ రావ‌ణ్ ఫ‌స్ట్ లుక్

‘పలాస 1978’ వంటి పీరియడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటించిన రక్షిత్‌ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్‌ రావణ్‌. న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోంది. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్‌ నటి రాధికా, నటు-డు చరణ్‌ రాజ్‌,తమిళ నటు-డు విద్యా సాగర్‌ ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
‘నీ ఆలోచనలే నీ శత్రువులు’ అనే కాప్షన్‌ తో రక్షిత్‌ ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని విడుదల చేశారు. ఈ -టైటిల్‌ పోస్టర్‌ లో ఉత్కంఠంగా హైవే, సిటీ- మరియు ఇతర విజువల్స్‌ ఉండడం చిత్రం పై అంచనాలు కలిగిస్తుంది.
ధ్యాన్‌ అట్లూరి నిర్మాణంలో షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణంతర కార్యక్రమాలలో నిమగ్నమైపోయిన చిత్ర యూనిట్‌ నుండి మరిన్ని వివరాలు త్వరలోవెలువడనున్నాయి.
ఈ చిత్రంలో రక్షిత్‌ అట్లూరి, సంగీర్తన విపిన్‌, రాధికా శరత్‌ కుమార్‌, చరణ్‌ రాజ్‌, కాంచి, రాకెట్‌ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్‌ రాము, విద్యా సాగర్‌, టీ-వీ5 మూర్తి, కార్తీక్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: శరవణ వాసుదేవన్‌, సంభాషణలు: లక్ష్మీ లోహిత్‌ పూజారి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, నిర్మాత: ధ్యాన్‌ అట్లూరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement