Thursday, April 25, 2024

ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పై అదిరిపోయే న్యూస్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించబోతున్నాడు. ఇక కృతి శెట్టి సీత గా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా కథను మేకర్స్ ఇండియన్ సినిమాకి ఇప్పటివరకు వినియోగించని టెక్నాలజీని వినియోగిస్తున్నారని అప్పట్లో టాక్ నడిచింది.

అయితే మరోసారి ఇదే విషయమై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రానికి మనదేశంలోనే భారీ విజువల్ ట్రీట్ అయినా 2.0 కన్నా అత్యధిక విఎఫ్ఎక్స్ షాట్స్ పెడుతున్నారట. బాహుబలికి 2500, 2.ఓ కి 3 వేలకి పైగా విఎఫ్ఎక్స్ ను ఉపయోగించగా ఆదిపురుష్ కి ఏకంగా ఎనిమిది వేల విఎఫ్ఎక్స్ షాట్స్ ను వినియోగిస్తున్నారట. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇది వింటేనే అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement