Saturday, April 20, 2024

‘వజీల్ సాబ్’ మూడవ రోజు కలెక్షన్స్ సూపర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం థియేటర్స్ లో హవా కొనసాగిస్తోంది. వీకెండ్ లో కలెక్షన్లతో మోత మోగించింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అదే జోష్ ను కంటిన్యూ చేస్తోంది. రెండు రోజుల తర్వాత ఏపీ నైజాంలో కలిపి 42.5 కోట్ల షేర్ మిగతా రాష్ట్రాలలో 5.75 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 48.2 5 కోట్ల షేర్, 72 కోట్ల గ్రాస్ ను వసూళ్లను సాధించింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో 90 కోట్లు సాధించిన ఈ చిత్రం 54 శాతం వసూళ్లను రాబట్టి నట్లు తెలుస్తోంది.

ఇక మూడో రోజున యూఎస్ లో 600k డాలర్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరేందుకు రెడీగా ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడో రోజున 25 కోట్ల నుంచి 30 కోట్ల కలెక్షన్లను వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.దీంతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌ లో చేరేందుకు చేరువైనట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement