Wednesday, April 24, 2024

మాస్ట్రో గా మారిన నితిన్

ఇటీవల రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఇప్పుడు మాస్ట్రో గా రాబోతున్నాడు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో ఎప్పుడూ కనిపించని విధంగా నితిన్ బ్లైండ్ గా కనిపించనున్నాడు. ఇక ఫస్ట్ లుక్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ గా అర్థం అవుతోంది.

మరోవైపు ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తుండగా.. హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుధాకర్, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement