Thursday, April 25, 2024

శిష్యులు అయ్యారు… ఇప్పుడు గురువు వంతు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కాగా ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు. అలాగే ఆ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించి వీడియోలను రిలీజ్ చేసి ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచాడు రాజమౌళి.

మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతోనే మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే అజయ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 2న అజయ్ దేవగన్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతుంది. ఈ సినిమాలు అల్లూరి సీతారామరాజు గురువు గా కనిపిస్తాడని తెలుస్తుంది. దీంతో అజయ్ గెటప్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement