Thursday, April 18, 2024

ఎన్టీఆర్ నుదుటిపై ఉన్నది గాయం కాదట

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం చిత్ర యూనిట్ ఉక్రెయిన్ వెళ్లి ఓ పాటను చిత్రీకరించే పనిలో ఉన్నారు.అయితే షూటింగ్ విరామ సమయంలో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి చేసిన ఓ ఫన్నీ వీడియో ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

అయితే అందులో ఎన్టీఆర్ నుదిటి పై దెబ్బతగిలి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాగా దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆ గాయం ఏంటంటూ సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. దీనిపై ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పందిస్తూ… అది దెబ్బ కాదని మేకప్ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement