Tuesday, October 8, 2024

జూన్2న‌.. భోళాశంక‌ర్ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ తెర‌కెక్కిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్..కాగా చిరంజీవికి చెల్లిగా హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక భోళా శంకర్ పాటల సందడికి సమయం వచ్చేసిందంటూ ఇటీవలే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రేపు (జూన్ 2న) రిలీజ్ చేయనున్నారట.. ఇక ఫుల్ లిరికల్ సాంగ్ జూన్4న రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ.. చిరు లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు. మెగా ఫెస్టివల్ వచ్చేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement