Friday, April 26, 2024

హైద‌రాబాద్ లో..ఓజీ సెకండ్ షెడ్యూల్

యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఓజీ.ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్నాడు.ఈ మూవీ అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్.ముంబై షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌ సెకండ్‌ షెడ్యూల్ షురూ అయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. ఓజీ నయా షెడ్యూల్‌ షూటింగ్ హైదరాబాద్‌లో షురూ అయిందని స్ప‌ష్టం చేశారు. ఇటీవలే మహారాష్ట్రలోని వాయ్‌ సరస్సు ప్రాంతంలో ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతున్నట్టు అప్‌డేట్ కూడా వచ్చింది.ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ స్టైలిష్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు నెట్టింట హల్‌ చల్ చేస్తున్న స్టిల్స్‌ చెబుతున్నాయి. ఓజీలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఇప్పటికే ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement