Friday, September 24, 2021

ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొన్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు… వారసుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో ఇప్పుడు దర్శనమిచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయం కు వెళ్లారు. అక్కడ కెమెరా కంటికి చిక్కారు ఎన్టీఆర్.

అంతేకాకుండా అక్కడ ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది, అధికారులు ఎన్టీఆర్ తో తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ మొత్తం 383.35 కోట్లు – రూ.460.02 కోట్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News