Monday, May 17, 2021

ఎన్టీఆర్ పెళ్లిరోజు….అభిమానుల విషెస్ లు

మామూలుగా తమ అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద సంఖ్యలో విషెస్ లు తెలుపుతూ ఉంటారు. కాగా నేడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ 2011లో లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు పిల్లలు. ఇక మామూలుగా ప్రణతి బయట ఎక్కడా కూడా పెద్దగా కనిపించరు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్స్ లో మాత్రం మెరుస్తూ ఉంటారు.

ఇక ఎన్టీఆర్ కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయంలో మాత్రం కుటుంబంతోనే గడుపుతారు. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News