Thursday, April 25, 2024

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్?

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా సరైన హిట్ లేక ఎంతో ఎదురుచూస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే గతంలో మునుపెన్నడూ చేయని విధంగా సరికొత్త కాన్సెప్ట్ తో హిస్టారికల్ చిత్రం బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు వశిష్ట్ దర్శకత్వం వహించబోతున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కళ్యాణ్ రామ్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి ఓ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ బింబిసార చిత్రానికి తారక్ వాయిస్ ఓవర్ నిజమే అయితే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయి అనడంలో సందేహమే లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement