Thursday, April 25, 2024

స్టార్ట్ చేసేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ప్రమోషన్ లో భాగంగా కొన్ని రోజులు మా భీమ్ ఆర్ ఆర్ ఆర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను హ్యాండిల్ చేస్తారని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. అయితే అలా అనౌన్స్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఓ వీడియో పోస్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. డ్రమ్స్ ప్రాక్టీస్ ఏమైంది అంటూ రామ్ చరణ్ ను ఎన్టీఆర్ ప్రశ్నించగా…అదిరిపోయింది అంటూ సమాధానమిచ్చాడు చరణ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CSV3YFwHsGX/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement