Friday, April 26, 2024

ఎన్టీఆర్ కొత్త కారు….ధర ఎంతో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస హిట్లు అందుకుంటూ మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ కు కార్లు అంటే విపరీతమైన ఇష్టం. మార్కెట్లోకి ఎలాంటి కొత్త మోడల్ లో వచ్చిన దాని మీద చేయి పడాల్సిందే. కాగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లంబోర్గిని మొట్టమొదటి ఎస్‌యూవీ అయిన ఉరుస్‌ను కొన్నాడు.

అయితే ఆన్ రోడ్ తో కలిపి పనులు మినహాయించి ఈ కారు ధర 3.15 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది గంటకు 305 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. 3.6 సెకన్ లలో సున్నా నుండి 100 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement