Friday, April 19, 2024

ఎన్టీఆర్ కొరటాల సినిమా ఫిక్స్ ? త్రివిక్రమ్ యు టర్న్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

కానీ గత రెండు రోజులుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఖండించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన తర్వాత సినిమా కొరటాల శివ తో చేయబోతున్నాడట. నిజానికి ఆచార్య తర్వాత కొరటాల శివ అల్లుఅర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ పుష్ప సినిమా షూటింగ్ లేట్ అయ్యే ఆ పరిస్థితి కనిపించడం తో కొరటాల ఎన్టీఆర్ వైపుకు తిరిగారట.

ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ తీయబోయే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారట. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇక మరోవైపు ఎన్టీఆర్ కొరటాల జాతకట్టటం తో త్రివిక్రమ్ మహేష్ బాబు కు వైపుకు తిరిగారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement