Friday, March 29, 2024

ఎన్టీఆర్ ఇంకా ఆ యంగ్ డైరెక్టర్ కు ఎస్ చెప్పలేదట !!

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సాన. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ యంగ్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి కాంబినేషన్ పై సినిమా ఇంకా కన్ఫార్మ్ కాలేదట.

ప్రస్తుతం బుచ్చిబాబు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. అంతా పూర్తయ్యాక ఎన్టీఆర్ ను కలిసి కథ వినిపించనున్నాడట. ఎన్టీఆర్ ఓకే చెబితే ఈ సినిమా చేసే అవకాశం ఉందట. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే దీని తరువాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement