Thursday, April 25, 2024

ఈ ఏడాది ఎన్టీఆర్ డబుల్ ధమాకా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అయితే జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. తారక్ నెక్స్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నాడు. ‘జనతా గ్యారేజ్’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇదీ.

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం మూడేళ్లకి పైగా టైమ్ కేటాయించాడు. తారక్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల అవుతుందనుకుంటే వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇక తదుపరి సినిమాలను చకచకా పూర్తి చేయాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీన ‘ఆచార్య’ విడుదల కాగానే.. ఎన్టీఆర్ సినిమాని కొరటాల శివ మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాని ఇదే ఏడాదిలో కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయని అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement