Thursday, April 25, 2024

NS22 షూటింగ్ స్టార్ట్

యంగ్ హీరో నాగ శౌర్య కరోనా సమయంలో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తాను నటిస్తున్న లక్ష్య, వరుడు కావలెను చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా కరోనా కారణంగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య చేస్తున్న సినిమా షూటింగ్ గతంలో వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈ సినిమా షూటింగ్ కూడా తిరిగి రీస్టార్ట్ అయింది. ఈ సినిమాను ఎన్ఎస్ 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా నేడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించి ఓ ఫోటోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో నాగశౌర్య తల్లి, హీరోయిన్, దర్శకుడు కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement