Tuesday, March 26, 2024

‘నవంబర్ స్టోరీ’ మిల్కీ బ్యూటీ ట్రైలర్ రిలీజ్

ఇటీవల కాలంలో డిజిటల్ రంగానికి ఆదరణ పెరిగింది. ఓటీటీలలో ప్రసారం అయ్యే వెబ్ సిరీస్ లకు, షోలకు డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అందులో భాగంగానే మిల్కీబ్యూటీ తమన్నా నటించిన 11th అవర్ వెబ్ సిరీస్ ఇటీవల రిలీజ్ అయింది. అయితే దీనికన్నా ముందు తమన్నా నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేసింది. అయితే ఇది ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇక ఈనెల 20న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హాట్ స్టార్ లో విడుదల కానుంది.

కాగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సిరీస్ లో తమన్నా క్రైమ్ నవలా రచయిత గణేషన్ కుమార్తె అనురాధ పాత్రను పోషించింది. అనుకోకుండా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంటిలో ఓ హత్య జరుగుతుంది. 47 సార్లు పెన్ తో పొడిచి హత్య చేయడమే కాకుండా పెయింట్ పూయటం వల్ల హత్యకు ఆనవాలు దొరకవు. దీనితో పోలీసులు తమన్నా తండ్రి క్రైమ్ రచయిత ఈ హత్య చేశాడని అనుమానిస్తారు. అయితే ఆ నిజమైన హంతకుడు ఎవరో కనిపెట్టి తన తండ్రిని తమన్నా కాపాడుకుంటుందా లేదా అనేది ఈ సిరీస్ కథ. మరి ప్రేక్షకులను ఈ మేర ఇది ఆకట్టుకుంటుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement