Saturday, April 20, 2024

ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు.. మృణాళిని ర‌వి

తనకు కాబోయే ప్రేమికుడు ఎలా ఉండాలో చెప్పింది న‌టి మృణాళిని ర‌వి. తనకు స్టార్ హీరోలు విజయ్ దళపతి.. అజిత్ కుమార్ ఇద్దరూ ఫేవరేట్ హీరోస్ అని.. డాన్స్ లో విజయ్.. వ్యక్తిత్వంలో అజిత్ అని చెప్పింది. తనకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని తెలిపింది. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. తనను ఎప్పుడూ నవ్వించేలా ఉండి.. ఆనందంగా చూసుకునే ఒకే ఒక్క అర్హత తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ కు ఉండాలని తెలిపింది. అలాగే ప్రస్తుతం తనకు ప్రేమ, పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని.. తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంద‌ని చెప్పింది. హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎనిమి చిత్రంలోని టమ్ టమ్ పాట సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సిగ్నేచర్ స్టెప్పుతో అదరగొట్టిన మృణాళిని ర‌వి ఫాలోయింగ్ పెరిగిపోయింది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాళిని.

Advertisement

తాజా వార్తలు

Advertisement