Thursday, April 25, 2024

ఫైనల్ గా ఓటీటీ బాట పట్టిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా తెరకెక్కిన
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో నితిన్ జంటగా కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించింది. ఇక కోలీవుడ్ నటుడు సముద్రఖని నెగటివ్ రోల్ చేసిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

అయితే ఈ మూవీ ఒటిటిలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకాభిమానులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫైనల్ గా ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీని డిసెంబర్ 9న ప్రముఖ ఒటిటి ప్లాట్ ఫామ్ జీ5 లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి అటు థియేటర్స్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేయని ఈ మూవీ ఓటిటి లో ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement