Thursday, March 28, 2024

ఆక‌ట్టుకుంటోన్న ఊరిపేరు భైరవకోన.. లిరిక‌ల్ సాంగ్

విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌దైన‌శైలిలో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్. తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరే ఊరు పేరు భైరవకోన. సందీప్ కిషన్ జోడీగా వర్ష బొల్లమ్మ నటించిన ఈ సినిమాను రాజేశ్ దండ – బాలాజీ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నిజమేగా చెబుతున్నా జానే జానా .. నిన్నే నే ప్రేమిస్తున్నా’ అంటూ సాగుతోంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్ ను ఆకట్టుకునే బీట్ తో ఈ పాట సాగుతోంది. వీఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ … ఒక్క క్షణం’ చూస్తే, ఆయన మార్క్ సినిమాలు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన లైన్ పైనే ‘ఊరుపేరు భైరవకోన’ నడవనుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement