Tuesday, April 23, 2024

నిధి అగర్వాల్ కి కోపమొచ్చింది !!

స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందింది నిధి అగర్వాల్. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్… అప్పుడప్పుడు రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా కొంతమంది ఆకతాయిలు ఆమెకు సంబంధించిన ఫేక్ ఫోటోలు షేర్ చేస్తూ కోపం తెప్పించారు.

ఇదే విషయాన్ని చెబుతూ నాకు సంబంధించిన ఓ ఫోటో అవసరం లేకపోయినా… అది వైరల్ అవుతోంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే వాటిని షేర్ చేయకండి. అది అనవసరం. అలాంటి చీప్ పనులు చేయవద్దు అని చెప్పుకొచ్చింది. ఇదే విషయం చెబుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది నిధి అగర్వాల్. ఇక సినిమాల విషయానికొస్తే నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement