నిధి అగర్వాల్.. పేరుకు తగ్గట్టే అందాల నిధి. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. మంచి బ్రేక్ కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తుంది. అయితే 2025 మాత్రం తనదే అంటుందీ భామ.
2025 తన కెరీర్‌లో మరిచిపోలేని అనుభూతుల్ని ఇస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతూ.. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెబుతోంది. ఆమె నటించిన రెండు బిగ్ మూవీస్ లో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, రెండోది రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ .
ఈ రెండు చిత్రాలు 2025వ సంవత్సరంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే కాకుండా బిజీ హీరోయిన్‌ని చేస్తాయని ఈ అందాల నిధి ఆశిస్తోంది.
‘ది రాజా సాబ్’ సినిమాను మూవీ టీమ్ ఎంతో డెడికేటెడ్‌గా రూపొందిస్తున్నారని.. ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం మరిచిపోలేనని నిధి చెబుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది.