Thursday, April 25, 2024

రోజా జబర్దస్త్ కు పూర్తిగా దూరం అయినట్లేనా ? సోషల్ మీడియాలో ప్రచారం !!

ప్రముఖ నటి ఎమ్మెల్యే రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇక బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రోజా జడ్జిగా వ్యవహరించారు. ఆ షో కు అంతటి పేరు రావడం లో కీలక పాత్ర పోషించారు. అయితే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ షో కు రోజా హాజరు కావట్లేదు. ఆమె స్థానంలో జడ్జి గా ఇంద్రజ వచ్చారు.

మొదట జబర్దస్త్ కు జడ్జ్ గా వచ్చిన ఇంద్రజ…. ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ కి కూడా జడ్జ్ గా వ్యవహరించనున్నారు. దీంతో రోజా పూర్తిగా జబర్దస్త్ షో కి పూర్తిగా దూరం అయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి రోజాకి గత కొన్ని రోజుల క్రితం రెండు కీలక సర్జరీలు జరిగాయి. దీంతో ఆమెను ఇంట్లోనే వైద్యులు ఉండాలని సూచించారు. తన ఇంటినే ఆఫీస్ గా మార్చుకున్న రోజా తన వ్యక్తిగత పనులతో పాటు నియోజకవర్గ పనులు ఇతర పనులను కూడా ఇంటినుంచే చేస్తున్నారు. కానీ జబర్దస్త్ విషయంలో మాత్రం రకరకాల పుకార్లు బయటికి వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement