Thursday, April 18, 2024

పోలీస్ వరకు ఓకే…డాక్టర్ కి నో ?

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్రకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, అలాగే డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని డ్యూయల్ రోల్ ఈ సినిమాలో చేయబోతున్నాడని టాక్ నడిచింది.

అయితే తాజా సమాచారం ప్రకారం పోలీస్ పాత్ర వరకూ నిజమే అని… అయితే డాక్టర్ పాత్ర పై మాత్రం నాటకీయంగా కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడని పూర్తిస్థాయిలో డాక్టర్ గా రామ్ పాత్ర లేదని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement