Thursday, April 18, 2024

బాలయ్య అఖండ రిలీజ్ పై కొత్త అప్డేట్!!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరోయిన్స్ గా ప్రగ్యా జైస్వాల్, పూర్ణా నటిస్తున్నారు. గతంలో బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దానిపై ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. తాజాగా రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉందట. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement