Thursday, April 18, 2024

కేజీఎఫ్2 రిలీజ్ పై కొత్త రూమర్ ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోరాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సూపర్ హిట్ సాధించింది. అలాగే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కుతుంది. ఇది రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మొదట ఈ సినిమాను జూలై 16న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మొదట టాక్ నడిచింది. మరోవైపు జూలై 16న కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, నాజర్ ,రావురమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement