Friday, April 19, 2024

సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్…కేజీఎఫ్ 2 నుంచి కొత్త పోస్టర్

సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా కే జి ఎఫ్ చాప్టర్ 2నుంచి అప్డేట్ వచ్చేసింది. అధీరా పాత్రలో నటిస్తోన్న సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ లో ఖడ్గాన్ని భుజంపై మోస్తూ ఠీవిగా
నడుస్తూ కనిపించాడు సంజయ్.

ఈ పోస్టర్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ కు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement