Wednesday, April 24, 2024

దొంగ!! దొరికిపోయావ్…మళ్ళీ కాపీనా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విదుదల కాగా… ఇప్పుడు మూడో పాట కంటిపాప కంటి పాప సాంగ్ ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ ఈ పాట రాయగా అర్మన్ మాలిక్ పాడారు. తమన్ మ్యూజిక్ అందించారు

ఇక్కడివరకు బాగానే ఉంది. మాములుగా థమన్ ను నెటిజన్స్ కాపీ క్యాట్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా పాటలకు మ్యూజిక్ ను కాపీ చేశాడని ట్రోల్స్ చేశారు. ఇప్పుడు కంటి పాప కంటి పాప సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నెటిజన్స్ పట్టేశారు. బొమ్మరిల్లు సినిమాలోని కన్నులు మూసి కలగంటామని ప్రేమికులంటుంటే పాట మ్యూజిక్ ని కాపీ కొట్టేసాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. దొరికిపోయావ్ దొంగా అంటూ ట్రోల్ చేస్తున్నారు. థమన్ కు ఇలా ట్రోల్ చేయించుకోవటం కొత్తఏమి కాదు అనుకోండి.. కానీ ఈ సారి థమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement