Saturday, June 12, 2021

నాగ శౌర్య పై నెటిజన్స్ ప్రశంసలు

హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన 2020 పాపులర్ మేల్స్ టాలీవుడ్ టాప్ హీరోస్ ను హైదరాబాద్ టైమ్స్ కూడా ప్రకటించారు. విజయ్ దేవరకొండ మొదటి ప్లేస్ లో ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడవ ప్లేస్ లో నిలిచారు. అలాగే 5వ స్థానంలో నాగశౌర్య నిలిచారు. గతంలో ఎన్టీఆర్ 2019లో ఈ జాబితాలో 19వ స్థానంలో ఉండగా తాజాగా మూడో స్థానానికి చేరుకున్నారు. కాగా నాగశౌర్య ఇందులో 5వ స్థానం దక్కించుకోవడం పట్ల సినీ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇక నాగ శౌర్య ప్రస్తుతం హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య… వరుడు కావలెను, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి లక్ష్య సినిమాలలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News