Thursday, March 28, 2024

రాజమౌళి పోస్టర్ కన్నా….ఫ్యాన్ మేడ్ పోస్టరే బాగుందంటున్న నెటిజన్స్

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రాజమౌళి ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ పోస్టర్ రిలీజ్ కాగానే అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. అంతేకాకుండా తారక్ లుక్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది.

అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పోస్టర్ అనుకున్న స్థాయిలో లేదని భీమ్ వీడియో లో ఉన్న ఇంటెన్స్ ఈ పోస్టర్ లో లేదని చెప్పుకొస్తున్నారు. దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్ బాగున్నాయని… ఇలాంటి పోస్టర్ డిజైన్ చేయడానికి ఆర్ ఆర్ఆర్ టీం అవసరం లేదని అంటున్నారు. ఎన్టీఆర్ కంటే బ్యాగ్రౌండ్ డామినేట్ చేసేలా చిత్ర యూనిట్ పోస్టర్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. మరి చిత్రయూనిట్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement