Friday, April 26, 2024

వర్మగారు…. బుక్ అయినట్టు ఉన్నారే !!

వర్మ…కాంట్రావర్శికి కేర్ ఆఫ్ అడ్రస్. నిత్యం ఏదో ఒక వివాదం తో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వేదికగా అయితే గంటకో ట్వీట్ చేస్తూ నెటిజన్స్ మాట్లాడుకోవటానికి ఏదో ఒక టాపిక్ ను లేపి విడిచి పెడుతూ ఉంటాడు. తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేశాడు వర్మ. ఆ ఫొటోలో అక్కినేని నాగేశ్వరరావు తో పాటు ఓ చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ ఫోటో సుడిగుండాలు సినిమా లోని ఫోటో.

కాగా ఆ ఫొటోలో ఉన్న బాబు అక్కినేని నాగార్జున అని…నాగార్జున నటించిన ఫస్ట్ సినిమా ఇదే అంటూ పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజన్స్ ఆ బాబు నాగార్జున కాదు సార్…కాంతారావు కొడుకు రాజా అంటూ తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు నాగార్జున కనిపించిన మొదటి సినిమా వెలుగు నీడలు లోని ఫోటోను పెట్టి నాగార్జున ఈ బాబు ఆ బాబు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement